Telangana Rythu Runa Mafi Latest Update Check Details @ clw.telangana.gov.in

రెండు లక్షల లోపు రుణ మాఫీ – తాజా వివరాలు

రుణ మాఫీ గురించి ముఖ్యమంత్రి ప్రకటన

తెలంగాణ లో ఇటీవల జరిగిన సభల్లో పదిహేనవ ఆగస్టు లోగా రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శపధం చేశారు. ఇందుకోసం అధికారులు విధివిధానాల కసరత్తులు వేగవంతం చేశారు. మార్గదర్శకాల తో కూడిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నిధులు మరియు బడ్జెట్ కేటాయింపు

రెండు లక్షల లోపు రుణ మాఫీ చేయడానికి ₹31,000 కోట్ల నిధులు అవసరమౌతాయని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం ఒకవైపు నిధులను కొనసాగిస్తూనే మరోవైపు రైతు భరోసా కు కేటాయించిన ₹7,500 కోట్ల బడ్జెట్‌ను రుణమాఫీకి మళ్లించే దిశలో చర్యలు తీసుకుంటుంది. రైతు భరోసా విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు మరియు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత రానుంది.

telangana rythu runa mafi latest update from ts cm for august 15

రుణ మాఫీకి లబ్ధిదారుల ఎంపిక

రుణమాఫీ లో లబ్ధిదారుల ఎంపికకు పాత మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. BRS ప్రభుత్వం లక్ష లోపు రుణాలను మాఫీ చేసినప్పుడు నిబంధనలు ఏవైతే పెట్టారో, ఇప్పుడు కూడా అవే నిబంధనలు ప్రామాణికంగా తీసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కట్ ఆఫ్ తేదీలు

రెండు లక్షల లోపు రుణ మాఫీ కి కట్ ఆఫ్ తేదీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కట్ ఆఫ్ తేదీలు డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి వర్తిస్తుంది. ఇది కూడా 18 నెలల టైం పీరియడ్ తో తీసుకున్న క్రాప్ లోన్స్ అయ్యి ఉండాలి. దీర్ఘకాలిక పంట రుణాలకు పథకం వర్తించదు.

రుణమాఫీ కోసం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకోవడం

రైతు కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని రుణమాఫీ చేస్తారు. కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు, కానీ రేషన్ కార్డు అనేది కచ్చితంగా అవసరం కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అలాగే ఒక కుటుంబానికి ఒకే రుణ మాఫీ జరుగుతుంది, అది 2 లక్షల లోపు మాత్రమే సాధ్యం . ఒకవేళ కుటుంబంలో అందరూ రుణ అర్హులైన సరే కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుంది.

పంచాయతీ మరియు మండల స్థాయిలో పర్యవేక్షణ

పంచాయతీ అసిస్టెంట్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ మరియు పంచాయతీ కార్యదర్శులు రుణ మాఫీ కోసం కుటుంబాలను గుర్తిస్తారు. తాసిల్దార్, MPDO, మరియు మండల వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. దీని కోసం పాత BRS ప్రభుత్వం లో ఉన్న పద్ధతులను ప్రామాణికంగా తీసుకోనున్నారు.

రుణమాఫీ నిబంధనలు

  1. ఒక కుటుంబానికి గరిష్టంగా రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది.
  2. తీసుకున్న అసలు మొత్తం, దానికైనా వడ్డీ మరియు రిన్యూవల్ లోన్స్ మొత్తం కలిపి ఒక కుటుంబానికి రెండు లక్షల లోపే రుణమాఫీ ఉంటుంది.
  3. ఉద్యాన పంటలపై తీసుకున్న రుణాలకు కూడా పథకం అమలు చేస్తారు.

ప్రత్యేక నిబంధనలు

  1. బంజర భూములు, ఇండ్ల స్థలాలు, గుట్టలు లాంటి భూములపై తీసుకున్న క్రాప్ లోన్స్ పరిగణలోకి తీసుకుంటారు.
  2. ప్రభుత్వ ఉద్యోగులు, డాక్టర్లు వంటి వారు తీసుకున్న వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యే అవకాశం లేదు.

రుణాల సేకరణ మరియు పర్యవేక్షణ

రుణమాఫీ కి మొత్తంగా మూడు ఫార్మాట్‌లలో లబ్ధిదారుల వివరాలు సేకరిస్తారు. బ్యాంక్ డేటా ఆధారంగా రుణాల వివరాలను క్రోడీకరించి, బ్యాంక్ మేనేజర్ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. డూప్లికేషన్ మరియు డబుల్ పేమెంట్ సమస్యలను నివారించేందుకు మండల స్థాయిలో సంయుక్త బ్యాంక్ కమిటీలు పని చేస్తాయి. పట్టాదారు పాసు పుస్తకాలతో తీసుకున్న రుణాలను గుర్తిస్తారు.

ఆఖరి దశ

జిల్లా సహకార ఆడిటర్లు మరియు బ్యాంక్ అధికారులు వ్యవసాయశాఖ ఐటీ విభాగం ద్వారా వివరాలను సార్టౌట్ చేసి ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. చివరిగా లబ్ధిదారుల జాబితాను గ్రామపంచాయతీలు మరియు బ్యాంక్ వద్ద ఉంచుతారు. జాబితాలో ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారికి తెలియజేయవచ్చు.

ముగింపు

రెండు లక్షల లోపు రైతులు తీసుకున్న క్రాప్ లోన్స్‌ను ఆగస్టు 15లోగా మాఫీ చేయనున్నారు. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల అవగానే పూర్తి వివరాలతో మరొకసారి అప్డేట్ చేస్తాం.

Scroll to Top